EV policy in telangana | రాష్ట్రంలో కొత్తగా ఈవీ పాలసీ
EV policy in telangana | రాష్ట్రంలో కొత్తగా ఈవీ పాలసీ
రేపటి నుంచి అమలులోకి రానున్న ఈవీ విధానం
ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Hyderabad : విద్యుత్ వాహనాలకు సంబంధించి నూతన విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ కొత్త ఈవీ పాలసీ సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కొత్తగా తీసుకువస్తున్న ఈవీ విధానం ఎంతగానే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ తరహా పరిస్థితులు హైదరాబాద్‌లో రావొద్దనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు విద్యుత్ ఆధారిత వాహనాలు ఉపయోగించడం ద్వారా కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు. ఫోర్ వీలర్ ఈవీలు, టూ వీలర్ ఈవీలు, కమర్షియల్ ఈవీలకు 100 శాతం పన్ను మినహాయింపు ఉంటుందని మంత్రి తెలిపారు. ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు సైతం మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన ఈవీ పాలసీ 2026 డిసెంబరు 31 వరకు అమలులో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. అయితే ఈ విధానం డిసెంబర్ 31, 2026 వరకు అమల్లో ఉంటుందన్నారు.
* * *
Leave A Comment